మీలో ఎవరు కోటీశ్వరుడు.. ఒక బోగస్ ప్రోగ్రాం - యండమూరి సంచలన వ్యాఖ్యలు

యండమూరి వీరేంద్రనాథ్ చేసిన వ్యాఖ్యలు ఈ కింద వీడియో లో చుడండి

NTR చేసిన పాపాలు చెప్తే ‘తూ’ అని ఉమ్మేస్తారు - నాదెండ్ల సంచలనం

  • దివంగత మాజీ ముఖ్యమంత్రి, ప్రముఖ నటుడు నందమూరి తారక రామారావుపై మరో మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత నాదెండ్ల భాస్కర్ రావు ఓ న్యూస్ ఛానల్‌తో మాట్లాడుతూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. 'ఎన్టీఆర్‌లో పాజిటివ్ విషయాలు నేనైతే గ్రహించలేదు. అతని గురించి ఏం మంచి ఉందని చెప్పమంటారు?' అని నాదెండ్ల వ్యాఖ్యానించారు. 'ఎన్టీఆర్‌లో మంచి ఏమిటంటే.. ఎన్టీఆర్ తన కుటుంబ సభ్యులను కూడా 'రండి' అంటూ గౌరవిస్తారు. ఎన్టీఆర్ తన భార్యను కూడా 'రండి' కూర్చోండి అంటాడు' అని అన్నారు. తానేమి ఇంటెలెక్చువల్ ని కాదని, అలా అయితే, రామారావు చేతిలో తాను వెన్నుపోటుకు ఎందుకు గురవుతానంటూ తనదైన శైలిలో అన్నారు. రాజకీయ నాయకులు ఫెయిల్ అయ్యారు కనుక, సినిమా వాళ్లు సీఎంలు అయ్యారని ఒక ప్రశ్నకు సమాధానంగా నాదెండ్ల సమాధానమిచ్చారు.
  • నాడు టీడీపీలో తానేనెంబర్ వన్ అని, ఎన్టీఆరే నెంబర్ టు అని నాదెండ్ల భాస్కరరావు చెప్పారు. ‘ఆ రోజు మీడియా అంతా నేను దుర్మార్గుడిని, ఎన్టీఆర్ సన్మార్గుడు అన్నట్లుగా చిత్రీకరించింది. ఆయన చేసిన పాపాలన్నీ చెబితే ‘తూ' అని ఉమ్మేస్తారు. ఎన్టీఆర్ ను అప్రతిష్టపాలు చేసే ఉద్దేశంతో నేను ఎప్పుడూ తప్పుడు సలహాలు ఇవ్వలేదు. భగవత్ సాక్షిగా చెబుతున్నాను.. అట్లాంటి పనులు నేను చేయను. నాడు చంద్రబాబు సలహాలు చెబుతుండేవాడు. ఆ సలహాలను విని పూనకంతో ఎన్టీఆర్ వచ్చేవాడు.... రెండు రూపాయలకు కిలో బియ్యం పథకం గురించి ఎన్టీఆర్ కు ఏం తెలుసు?' అని నాదెండ్ల భాస్కరరావు అన్నారు.
  • తెలుగుదేశం పార్టీ పడిపోతోందని, ఆ పార్టీని మళ్లీ బతికించాలంటే ఎన్టీఆర్ పై బయోపిక్ తీయడమే మార్గమని భావించారని, అందుకే, ఈ చిత్రం తీస్తామని ప్రకటించారని మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు అభిప్రాయపడ్డారు.
  • ‘కృష్ణుడు, రాముడు.. బొమ్మలు అన్నీ చూపిస్తే, పిచ్చి జనం అంతా మళ్లీ వస్తారనే ఉద్దేశంతో ఎన్టీఆర్ పై బయోపిక్ మొదలు పెట్టారు. ఇది మొదలు పెట్టింది చంద్రబాబు. వియ్యంకుడు బాలకృష్ణ ను పిలిచి సినిమా తీయాలని చెప్పాడు. వియ్యంకుడికి సినిమా బాధ్యతలు అప్పజెబితే... చంద్రబాబు తన కొడుకుని మంత్రి చేసుకోవచ్చు. మంత్రి పదవి కొడుక్కి ఇవ్వాలా? వియ్యంకుడికా? బాలకృష్ణ ఏమో ఎమ్మెల్యే, చంద్రబాబు కొడుకేమో ఎమ్మెల్యే కాదు. కనుక, మంత్రి పదవి తన కొడుక్కి ఇవ్వాలంటే.. బాలకృష్ణను పక్కకు తోసెయ్యాలి. మరి, పక్కకు తోసెయ్యాలంటే.. బాలకృష్ణను సినిమా తీయమని, కావాలంటే డబ్బులు తీసుకోమని చెప్పారు' అంటూ చెప్పుకొచ్చారు నాదెండ్ల భాస్కరరావు.
  • ‘ఎన్టీఆర్'పై తీయనున్న బయోపిక్ లో తన పాత్ర ఉండదని అనుకుంటున్నానని మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు అన్నారు. ‘ఎన్టీఆర్' జీవితం ఆధారంగా చిత్రాన్ని తీస్తానని బాలకృష్ణ అన్నారని, ఇందులో ఆయన జీవిత చరిత్ర అంతా చూపించాలని నాదెండ్ల కోరారు.
  • ‘ఈ చిత్రంలో మిమ్మల్ని విలన్ గా చూపించనున్నారటగా?' అనే ప్రశ్నకు నాదెండ్ల సమాధానమిస్తూ.. ప్రతి సినిమాలో విలన్ ఉండాలనే రూల్ ఏదీ లేదని, ఆ విధంగా చేస్తే కోర్టుకు వెళతానని, అప్పుడు ఆ సినిమా రిలీజ్ ఏ విధంగా అవుతుందని అన్నారు. తనకు, బాలకృష్ణకు మధ్య ఎటువంటి విభేదాలు లేవని ఒక ప్రశ్నకు సమాధానం చెప్పారు. బాలకృష్ణ తీయబోయే చిత్రంలో తన తండ్రి సినిమా జీవితాన్ని మాత్రమే తీసుకుంటే ఫర్వాలేదు గానీ, ఎన్టీఆర్ రాజకీయాల్లోకి ప్రవేశించడం గురించి తీస్తే బాలకృష్ణ చాలా చిక్కుల్లో పడతాడని అన్నారు. సినిమా తీసే ముందు బాలకృష్ణ తనను సంప్రదిస్తే, వాస్తవాలు చెబుతానని నాదెండ్ల అన్నారు.
  • స్వయంగా ఎన్టీఆరే తన అల్లుడు చంద్రబాబును తార్పుడు గాడు అని, రెండు వందల కోట్లు తినేశాడని అన్నారని మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
  • ‘ఎన్టీఆర్ ను నేను వెన్నుపోటు పొడిచాననడం చాలా తప్పు. ఎన్టీఆరే నన్ను వెన్నుపోటు పొడిచాడు. ఎన్టీఆర్ కు నేను వెన్నుపోటు పొడిచాననేది.. పత్రికలు చేసిన పని. పొలిటికల్ గా నాకు ఉన్న స్కిల్స్, ఎన్టీఆర్ చరిష్మా కారణంగానే కాంగ్రెస్ పార్టీని పడగొట్టాం. గంగా, యమున ఏకమయ్యాయి, కనుక, కాంగ్రెస్ పార్టీ పడిపోయింది. నా మూలంగానే టీడీపీ పుట్టింది. సినిమాల్లో హీరోగా ఆయన కనపడ్డా, నిజ జీవితంలో పెద్ద విలన్ ఆయన. టిక్కెట్ల ఎంపికలో మా ఇద్దరిలో ఎవరిదీ పైచేయి కాదు. ఇద్దరం చాప వేసుకుని కూర్చున్నాము. ఎన్టీఆర్ అయితే, అసలు పోటీ చేయనని కూర్చున్నాడు. ఎందుకంటే, భయం.. ఓడిపోతానని భయం. ఎన్టీఆర్ వియ్యంకులు ఆయన్ని డిస్కరేజ్ చేశారు. మానవ నైజం చెబుతున్నాను.. ఎంత ధైర్యస్తులో అంత పిరికివాళ్లు కూడా' అని నాదెండ్ల చెప్పుకొచ్చారు. కాగా, నాదెండ్ల చేసిన ఆరోపణలపై తెలుగుదేశం నేతలు ఆగ్రహం వ్యక్తం చేసే అకాశాలు కనిపిస్తున్నాయి.

పెళ్లి సాధారణంగా చేసుకుని ఆ డబ్బులతో ఊరికి మంచి నీటి ప్లాంట్ కట్టించారు

ఎవరికైన సహాయం చేయాలంటే కోట్ల డబ్బు ఉండాల్సిన అవసరం లేదు, చేయాలన్న సృహ ఉంటే చాలు అని నిరూపించింది మహారాష్ట్ర కి చెందిన జయంత్ భోలే కుటుంబం. ప్రక్క వారికి సాయం చేయాలని మనందరికి ఉంటుంది కాని భవిష్యత్తులో చేయోచ్చులే అని ఈరోజు మనం చేతులు కట్టుకొని కూర్చోని సమయం కొరకు ఎదురుచూస్తుంటాం. కాని జయంత్ భోలే ఫిబ్రవరి 11 న తన కుమారుడి వివాహ సందర్భంగా ఆడంభరాలకు పోకుండా పెళ్లి సాధారణంగా చేసుకుని, త్రాగునీటి సమస్యతో బాధపడుతున్న మహారాష్ట్ర జల్గావ్ జిల్లాలో ని వార్ఖెడె గ్రామానికి శాశ్వతంగా సురక్షితమైన త్రాగు నీరు అందించే నీటి శుద్ధి యంత్రం(రివర్స్ ఓస్మోసిస్ యంత్రం)ను విరాళంగా ఇచ్చాడు.

ఈ పెళ్ళికి ఒక్క రూపాయి కట్నం కూడా తీసుకోలేదు అంతే కాకుండా తమకు వీలైనంతగా ఇతరులకు సహాయం చేయాలని అమ్మాయి తరపు కుటుబం వారిని కూడా ఒప్పించారు. ఇలా ఇరు కుటుంబాలు కలిసి 1.7 లక్షలు జమ చేసారు. ఆ డబ్బుని వార్ఖెడె గ్రామంలో రివర్స్ ఓస్మోసిస్(RO) ప్లాంట్ పెట్టడానికి విరాళంగా ఇచ్చి తన ఔన్నత్యాన్ని చాటుకున్నారు.

ఈ తెలుగబ్బాయి 6 నెలల్లో ఏకంగా 8 అడుగులు పెరిగిపోయాడు.. కారణం ఏంటో తెలిస్తే..

ఇక్కడ ఈ ఫొటోలో కనిపిస్తున్న యువకుడు ఏకంగా 8 అడుగుల 3 అంగుళాలు ఉన్నాడు. పేరు ఇజ్జాడ షణ్ముఖరావు. వయసు 24 ఏళ్లు. శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం బిళ్లాని అతని స్వగ్రామం. సాధారణంగా కుటుంబ సభ్యులు, తల్లిదండ్రుల నుంచి వంశపారంపర్యంగా వచ్చే జీన్స్‌ ప్రభావంతో కొంత మంది పొడవుగా పెరుగుతారు. షణ్ముఖరావు తల్లిదండ్రులు రామలక్ష్మి, సూర్యనారాయణ.. ఇద్దరు సోదరులు ఐదున్నర అడుగుల పొడవు ఉన్నారు. షన్ముఖరావు ఆరేళ్ల క్రితం వరకు.. ఐదున్నర అడుగులే ఉండేవాడు. ఆ తర్వాత పచ్చ కామెర్ల వ్యాధి రావడంతో మందులు వాడాడు. అప్పటి నుంచి పెరగడం ప్రారంభమైంది. ఆరు.. ఏడు.. ఎనిమిది.. ఇపుడు ఏకంగా 8 అడుగుల 3 అంగుళాల ఎత్తు ఉన్నాడు. అమాంతంగా పొడవు పెరగడంతో ఇబ్బందులు పడుతున్నానని షణ్ముఖరావు ఆవేదన చెందుతున్నాడు. పదో తరగతి వరకు చదివిన తాను ఉపాధి పనులకెళ్తున్నానని చెప్పాడు. పొడవుగా ఉన్నందున ఇతర పనులకు పిలవడం లేదని, ఆటో.. కారులో ప్రయాణించాలంటే ఇబ్బందులు ఎదురవుతున్నాయని వాపోయాడు. పాదాలకు సరిపడా చెప్పులు కూడా లభ్యం కావడం లేదని ఆందోళన వ్యక్తం చేశాడు. రోడ్లో వెళ్తుంటే వింతగా చూస్తున్నారని, అందువల్ల ప్రస్తుతం ఇంటికే పరిమితం అయ్యానని చెబుతున్నాడు. పెళ్లి చేసుకోవాలని ఆసక్తి ఉన్నా.. పిల్లను ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ప్రపంచంలో ప్రస్తుతం జీవించి ఉన్న వాళ్లలో అత్యంత పొడగరిగా టర్కీకి చెందిన సుల్తాన్‌ కోసెన్‌(34) 8 అడుగుల 2.8 అంగుళాలతో ఉన్నాడు. షణ్ముఖరావు ఇటీవలే సుల్తాన్‌ను అధిగమించి 8 అడుగుల 3 అంగుళాలకు చేరుకున్నాడు. అయితే ఈ విషయం ఇంకా రికార్డుల్లోకి ఎక్కలేదు. మృతి చెందిన వారిలో యూఎస్‌ఏకు చెందిన రాబర్ట్‌ పర్షింగ్‌ వాడ్లో 8 అడుగుల 11.1 అంగుళాలు ఉండేవాడు.

ఈ లేడీ IAS ఆఫీసర్ ని చూస్తే.. కల్తీ వ్యాపారస్తులు ప్యాంటు తడిసిపోతుంది..

ఐఏఎస్… దేశంలో కొన్ని లక్షల మందికి ఓ కల… కానీ ఆ కల నెరవేరాక, ఆ సర్వీసుకు వన్నె తెచ్చేది కేవలం కొందరే… ఐఏఎస్ అనగానే నాయకుల కొమ్ము కాస్తూ, అక్రమార్కులకు వత్తాసు పలుకుతూ విధేయంగా వ్యవహరించే అధికారులు గుర్తొస్తున్న ఈ కాలంలో కేరళకు చెందిన ఓ యంగ్ ఐఏఎస్ అధికారిణిది పూర్తి డిఫరెంట్ స్టోరీ… 2010 యూపీఎస్సీ పరీక్షలో నాలుగో ర్యాంకర్‌గా నిలిచిన టీవీ అనుపమ… కల్తీ వ్యాపారుల వెన్నుల్లో చలి పుట్టిస్తున్నది… నిప్పు… సింపుల్‌గా చెప్పాలంటే ఆమె సర్వీస్ గురించిన వివరణ అంతే… నిజాయితీ, ధైర్యం, దూకుడు… అప్పటిదాకా నిస్తేజంగా ఉన్న ఓ శాఖ ఉద్యోగులను పరుగులు పెట్టిస్తూ హల్‌చల్ చేస్తున్నది… శెభాష్ అనిపించుకుంటున్నది… శెల్యూట్ కొట్టించుకుంటున్నది…

ప్రస్తుతం ఆమె కేరళ ఫుడ్ సేఫ్టీ కమిషనర్… 15 నెలల్లో దాదాపు 6 వేల కల్తీ ఆహారం శాంపిళ్లను కోర్టు ముందు ప్రవేశపెట్టి, కేసుల్ని నిరూపించి, స్థిరంగా నిలబడి, ఒత్తిళ్లకు లొంగకుండా వ్యవహరించి… 750 కేసులు పెట్టింది… దాదాపు ప్రతీ కేసులోనూ వాళ్ల అక్రమాల్ని నిరూపించింది… శిక్షలు పడేలా చేసింది… కటకటాల వెనక్కి పంపించింది… ఆమె ఒకేసారి కేరళలోని పలు మార్కెట్లపై దాడులు చేయించి, సరుకుల్ని పరీక్షలు చేయించింది… కొన్నింటిలో అనుమతించిన పరిమితులు దాటి 300 శాతం దాకా పెస్టిసైడ్ల అవశేషాలు తేలాయి… దాదాపు ప్రతీ సరుకూ కల్తీ… స్వచ్ఛమైన సరుకులే మార్కెట‌్‌లో కనిపించని దుస్థితి… దాంతో ఇక ఆమె యాక్షన్ స్టార్ట్ చేసింది…
అన్నింటికీ మించి తన పెరట్లోనే సొంతంగా కూరగాయలు పండించడం స్టార్ట్ చేసి, ఓ క్యాంపెయన్ తీసుకుంది… సోషల్ మీడియా సపోర్ట్ కూడా తీసుకుంది… స్థానికులు, ప్రభుత్వం ప్రోత్సాహం కూడా తోడైంది… గతంలో కేరళ 70 శాతం కూరగాయల్ని కర్నాటక, తమిళనాడు నుంచి దిగుమతి చేసుకునేది… విచ్చలవిడిగా పెస్టిసైడ్లు వాడి సాగుచేసే ఆ కూరగాయలు ప్రజల ఆరోగ్యానికి పెద్ద ముప్పుగా మారాయి… కానీ ఇప్పుడు కేరళ రాష్ట్రం సొంతంగానే 70 శాతం కూరగాయల్ని పండించుకుంటున్నది… ఆమె పెడుతున్న కేసులు, కోర్టుల్లో పడుతున్న శిక్షల కారణంగా సరుకుల్లో రకరకాల కల్తీ కూడా గణనీయంగా తగ్గిపోయింది… శెభాష్ అనుపమా… శెల్యూట్…

షుగర్‌కు శాశ్వత పరిష్కారం? వైద్యశాస్త్రంలో పెను సంచలనం

మధుమేహాన్ని పూర్తిగా నయం చేస్తే.. మళ్లీ మళ్లీ మందు బిళ్లలు.. ఇన్సులిన్‌ అవసరం లేకుండా ఓ చిన్నపాటి ఆపరేషన్‌తో దీనికి పూర్తిగా చెక్‌ పెట్టేస్తే.. మానవ జాతికి ఇంతకన్నా మహాభాగ్యం మరోటి ఉండదు. ఆ మహాభాగ్యాన్ని త్వరలో మన భాగ్యనగరి కల్పించబోతోంది. ఇక్కడి వైద్యులు ఎండోస్కోపీ చికిత్సా విధానంతో మధుమేహాన్ని పూర్తిగా నియంత్రణలోకి తేవచ్చని గుర్తించారు. ఈ విధానాన్ని

ఏడుగురు రోగులపై పరిశీలించగా అది విజయవంతమైంది కూడా. దీంతో మరింత మంది మధుమేహులకు ఈ చికిత్సను అందించి.. వారిలో వచ్చే ఫలితాలను ఆధారం చేసుకుని పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నారు. ఈ విధానం వినియోగంలోకి వస్తే భవిష్యతలో మధుమేహ బాధితులు మందులు, ఇన్సులిన్‌ వాడాల్సిన అవసరంలేదని ఏషియ న్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ర్టో ఎంటరాలజీ డైరెక్టర్‌ డాక్టర్‌ డి.నాగేశ్వర్‌రెడ్డి తెలిపారు. మొదటి వరల్డ్‌ కాంగ్రెస్‌ ఆఫ్‌ జీఐ ఎండోస్కోపీ(ఎండో 2017) సందర్భంగా హెచ్‌ఐసీసీలో ఆదివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయనతో పాటు వైద్యులు డాంగ్‌ వాన్‌ సీ, ఫాబిన్‌ ఎమ్యురా, లార్స్‌ అబ్‌ఖాన్‌, హోర్‌స్ట్‌, జాన్‌ ఫ్రాంకోస్‌ రే, రాబ ర్ట్‌ బెయిలీ, ఇబ్రహీం ముస్తఫా, జెర్మో డివే తదితరులు పాల్గొన్నా రు. ఈ సందర్భంగా డాక్టర్‌ నాగేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎండోస్కోిపీ విధానంతో మధుమేహా న్ని నియంత్రణలో పెట్టేందు కు విస్తృత పరిశోధనలు చేస్తున్నామన్నారు. ప్రస్తుతం ఇది ప్రయోగదశలో ఉందని, త్వరలో ఈ విధానంలో చికిత్స అందిస్తాన్నామని చెప్పారు. హైదరాబాద్‌లో 3 నెలల క్రితం ఏడుగురు రోగులకు ఎండోస్కోపితో మధుమేహాన్ని నియంత్రించినట్లు చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా 200మందికి ఈ విధానం ద్వారా డయాబెటి్‌సను అదుపులో పెట్టినట్లు చెప్పారు. క్లోమంలో ఇన్సులిన్‌ హెచ్చు తగ్గులవల్లే రక్తంలో గ్లూకోజ్‌ నియంత్రణలో ఉండదని భావించడం సరికాదని డాక్టర్‌ నాగేశ్వర్‌రెడ్డి చెప్పారు. చిన్నపేగుల్లోనూ ఇన్సులిన్‌ ఉత్పత్తి ఉంటుందని, దానిలో మార్పులు చేసి డయాబెటి్‌సను అదుపులో పెట్టవచ్చన్నారు. ఎండోస్కోపితో చిన్న పేగుల్లో ఇన్సులిన్‌ను ఎక్కువ, తక్కువ చేయొచ్చన్నారు. చిన్నపేగుల్లో మ్యూకోజ్‌ను 80 డిగ్రీల వద్ద కాల్చడం (బర్న్‌) వల్ల ఇన్సులిన్‌ తగిన మోతాదులో ఉత్పత్తి అవుతుందన్నారు. తరువాత చిన్నపేగును ఒక పొర(స్లీ్‌ప)తో కవర్‌ (పూడ్చడం) చేస్తామన్నారు. తద్వారా క్లోమంలో ఇన్సులిన్‌ క్రమబద్ద్ధీకరించవచ్చని పరిశోధనలో తేలిందన్నారు.

Latest News

Top 10