కరివేపాకు కొబ్బరినూనె ఈ రెండు కలిపి రాస్తే రాలిపోయిన జుట్టు మొత్తం తిరిగి వస్తుంది

షేర్ చేయండి
కరివేపాకు జుట్టు రాలాడాన్ని సమర్దవంతంగా తగ్గిస్తుంది పైగా ఇంట్లో దొరికే ఈ కరివేపాకు ఆయుర్వేదంలో కూడా అందం మరియు ఆరోగ్య విషయాల్లో చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది.
జుట్టు రాలటాన్ని తగ్గిస్తుంది
కరివేపాకు ఆకులు బీటా - కెరోటిన్ లను మరియు ప్రోటీన్ లను పుష్కలంగా కలిగి ఉంటాయి. ఇవి వెంట్రుకలు రాలటాన్ని తగ్గించి, పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. అంతేకాకుండా, ఇవి యాంటీ ఆక్సిడెంట్ లను పుష్కలంగా కలిగి ఉండి, తలపై చర్మానికి కావల్సిన తేమను అందించి, చుండ్రు నుండి విముక్తి కలిగిస్తాయి.

గిన్నెలో కొబ్బరి నూనెను తీసుకొని, తాజా కరివేపాకులను కలిపి, ఈ కరివేపాకులు నలుపు రంగులోకి మారేవరకు వేడి చేయండి. ఈ మిశ్రమాన్ని చల్లార్చండి. ఇపుడు మీ జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఇంట్లో తయారు చేసిన నూనే సిద్దంగా ఉందని అర్థం. ఈ మిశ్రమాన్ని నేరుగా మీ తలపై చర్మానికి అద్దండి. ఇలా 45 నిమిషాల పాటూ వేచి ఉండి, గాడతలేని షాంపూతో తలస్నానం చేయండి. ఇలా తయారు చేసిన నూనెను వారానికి రెండు సార్లు వాడండి. ఈ మిశ్రమం వెంట్రుకల పెరుగుదలను మాత్రమేకాకుండా, చిన్న వయసులో జుట్టు నెరవటాన్ని కూడా నియంత్రిస్తుంది.
హెయిర్ మాస్క్ ను తయారు చేయండి
కొన్ని తాజా కరివేపాకు ఆకులను గ్రైండ్ చేసి పేస్ట్ లా తయారు చేయండి. ఈ మిశ్రమానికి పెరుగుతో కలిపి పేస్ట్ లా తయారు చేసి, తలపై చర్మానికి నేరుగా అప్లై చేయండి. ఇలా 30 నిమిషాల పాటూ అలానే ఉంచి, నీటితో కడిగివేయండి. ఈ మాస్క్ ను ప్రతివారం ఒకసారి వాడటం వలన జుట్టు పెరుగుదల మెరుగుపడటమే కాకుండా, వెంట్రుకలను కాంతివంతంగా, మృదువుగా మారుస్తాయి.
షేర్ చేయండి

Latest News

Top 10