భర్తపై అసంతృప్తి ఉన్న భార్య ఏం చేస్తుందో తెలుసా ?

షేర్ చేయండి
భర్త వైఖరితో విసుగు చెందిన భార్యల ప్రవర్తన ఎలా ఉంటుందనే విషయంపై ఇటీవల ఓ సర్వే వెలువడింది. వాటిలో మీ భర్తపై మీకు సంతృప్తి ఉందా..? లేకుంటే ఎందుకు లేదు..? లేని వాళ్లు ఎలా ఉంటున్నారు..? వంటి సోషల్ మీడియా ద్వారా వివరాలను ఆరా తీసింది. ఈ సర్వేలో పలు ఆసక్తికరమయిన విషయాలు వెల్లడయ్యాయి. భర్తపై అసంతృప్తి ఉన్న మహిళల ప్రవర్తన విపరీత దోరణిలో ఉంటోందట. వారు తమ దైనందిన కార్యక్రమాలను అస్సలు పట్టించుకోవడం లేదట. భర్తపై తమకున్న అసంతృప్తి ఉన్న మహిళలను వీటి ద్వారా సులభంగా గుర్తుపట్టవచ్చట... అవేంటో చూద్దామా..?

భర్త వైఖరి నచ్చని మహిళలు ఎక్కువగా నిద్రపోరట. వారు నిత్యం ఏదో ఒకటి ఆలోచిస్తూ, దీనంగా కనపడుతుంటారట. భర్త పక్కన పడుకున్నా సరే రాత్రంతా ఏదో ఆలోచిస్తూ ఏ తెల్లవారుజామునో ఓ కునుకు తీస్తారట. అటువంటి వారు ఎక్కవగా ఒత్తిడి కలిగి ఉంటారట. ఆ ఒత్తిడి భరించలేక భర్తపై చీటికీమాటికీ కోపాన్నిప్రదర్శించి గొడవలకు కారణమవుతారని మానసిక నిపుణులు చెబుతున్నారు. భర్తపై కోపం, అసంతృప్తి, ఆయనతో జీవితాన్ని గడపడం పట్ల విరక్తి ఉన్న భార్య.. వేరే వ్యక్తులతో అక్రమ సంబంధాన్ని పెట్టుకోవడానికి ప్రయత్నిస్తారట. సుమారు 40 శాతం అక్రమ సంబంధాలు భర్తపై అసంతృప్తితోనే ముడిపడుతున్నాయని ఓ సర్వే అంచనా.. అంతేకాక భర్త, భార్య మధ్య మాటలే ఘనమవుతాయట. ఇద్దరిమధ్య బంధం తెగిపోయే సూచనలు.. ఎంత సేపు హాయిగా మాట్లాడుకుంటున్నారనే విషయమే తెలియజేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ప్రేమతో మాట్లాడే మాటలకు, విరక్తితో మాట్లాడే విషయాలకు తేడా స్పష్టంగా తెలుస్తుందంటున్నారు.
షేర్ చేయండి

Latest News

Top 10