మెగా స్టార్ అంటే ఇదీ.. మెగాస్టార్ రేంజ్ అంటే ఇలాగె ఉంటుంది.. ఒక టికెట్ 12 లక్షలు

మెగా అభిమానులను ఉత్తేజపరుస్తూ చిరంజీవి తన 150వ సినిమాను ప్రకటించాడు.. తీశాడు.. తాజాగా ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా చిరంజీవికే కాదు.. తన అభిమానులకూ ప్రత్యేకం, ప్రతిష్ఠాత్మకమే. అందుకే ఎప్పుడెప్పుడు వస్తాడా? ఎప్పుడెప్పుడు సినిమా చూస్తామా? అన్నంత ఆత్రంగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. రాక..రాక పదేళ్ల గ్యాప్ తర్వాత వస్తుండడంతో ఎంత ఖర్చైనా ఫర్వాలేదు.. తొలిరోజు తొలి షో చూసి తీరాల్సిందే అన్న పట్టుదలతో ఉన్నారు మెగా అభిమానులు. అందుకు నిదర్శనం బెంగళూరులో జరిగిన ఓ ఘటనే. ఓ థియేటర్లో 3 ఖైదీ టికెట్లను వేలం వేస్తే.. రూ.36 లక్షలకు దక్కించుకున్నాడట ఓ చిరు అభిమాని. ఇక, ఆ వేలంలో వచ్చిన డబ్బును చిరంజీవి పేరిట బెంగళూరులోని ఓ అనాథాశ్రమానికి విరాళంగా ఇవ్వాలని థియేటర్ యాజమాన్యం భావిస్తోందట. అంతేగాకుండా.. ఇటు స్పెషల్ షో టికెట్ ధరలూ ఆకాశాన్ని అంటుతున్నాయట. తెలుగు సినిమా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఖైదీకి భారీ స్పెషల్ షోలు ప్లాన్ చేస్తున్నారని టాక్. టికెట్ ధరలు రూ.500 నుంచి రూ.1500 దాకా పలుకుతున్నాయట. డైరెక్ట్‌గా తీసుకుంటే ఉన్న పరిస్థితి అది. అదే బ్లాక్ మార్కెట్‌లో అయితే డిమాండ్‌ను బట్టి రూ.2500 నుంచి ఆపైన పలుకుతున్నాయని చెబుతున్నారు. అంతేకాదు.. షో ప్రారంభం అయ్యే సమయానికి ఆ రేట్లు మరింత పెరుగుతాయని చెబుతున్నారు. 
Loading...

లేటెస్ట్ న్యూస్ కోసం మీ ఈమెయిల్ ఎంటర్ చేయండి

Top Trending News

Latest Posts