తమిళనాడు గవర్నర్‌గా కృష్ణంరాజు

తమిళనాడు గవర్నర్‌గా నటుడు, బీజేపీ నాయకుడు కృష్ణం రాజును నియమించే అవకాశాలు ఉన్నట్టు ఊహాగానాలు వస్తున్నాయి. ఇప్పటికే కేంద్రం పరిశీలనతో అతని పేరు ఉంది. కనుక కృష్ణంరాజు పేరు ఖరారయ్యే అవకాశం ఉందని సమాచారం. రెబల్ స్టార్ చాలా ఏళ్ల నుంచి బీజేపీలో కొనసాగుతున్నారు. వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న సమయంలో ఆయన కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. కేంద్రం కృష్ణంరాజు పేరునే ఖరారు చేస్తే... గవర్నర్ పదవి అలంకరించిన తొలి నటుడు ఇతనే అవుతారు. గతంలో కూడా కృష్ణంరాజు పేరును గవర్నర్ గిరికి పరిశీలించినట్టు వార్తలు వచ్చాయి. కానీ అప్పుడు అవకావం చేజారింది. 1998 నుంచి ఆయన బీజేపీలో కొనసాగుతున్నారు. కృష్ణంరాజు పశ్చిమగోదావరి జిల్లాలోని మొగల్తూరులో 1940, జనవరి 20న జన్మించారు.
Loading...

లేటెస్ట్ న్యూస్ కోసం మీ ఈమెయిల్ ఎంటర్ చేయండి

Top Trending News

Latest Posts