మాడిన రొట్టె, పసుపు రసం సాంబార్ మాత్రమే ఆహారం.. తమ దీనస్థితి ఏంటో ప్రధాని మోడీకి తెలియాలని వీడియో తీసి పంపిన జవాన్

జమ్ముకాశ్మీర్ సరిహద్దులో మంచులో విధులు నిర్వహిస్తూ బిఎస్ఎఫ్ జవాన్ తేజ్ బహదూర్ యాదవ్ పంపిన సెల్‌ఫోన్‌ వీడియోలపై కేంద్ర హోం మంత్రి విచారణకు ఆదేశించారు. తగిన చర్యలు తీసుకోవాలని హోం శాఖ కార్యదర్శిని ఆదేశించారు. తాము 11 గంటల పాటు అతి కష్టంగా విధులు నిర్వహిస్తున్నా తమకు సరైన ఆహారం కూడా పెట్టడం లేదంటూ తేజ్ బహదూర్ యాదవ్ వీడియోలు పంపారు. కేంద్ర ప్రభుత్వం తమను మంచిగా చూసుకుంటున్నా మధ్యలో అధికారులు నిధులన్నీ మింగేస్తున్నారని చెప్పారు. తమకు అద్వాన్నమైన ఆహారం పెట్టారని ఆరోపించారు. మాడిన రొట్టె, పసుపు రసం, సాంబార్ మాత్రమే ఆహారంగా ఇస్తున్నారని వీడియోలో చూపారు. తమ దీనగాథపై ప్రధాని మోదీ స్పందించాలని యాదవ్ కోరారు. యాదవ్ పంపిన వీడియోలు వైరల్ అయిన వెంటనే జాతీయ మీడియా వీటిని ప్రసారం చేశాయి. వీడియో ప్రసారమయ్యేనాటికే తనపై సీనియర్ అధికారులు వేటు వేసే అవకాశం ఉందనే అనుమానాన్ని కూడా యాదవ్ వ్యక్తం చేశారు. మీడియాలో యాదవ్ వీడియోలు ప్రసారమైన వెంటనే రాజ్‌నాథ్ స్పందించారు. దర్యాప్తు జరిపి వివరాలు తెప్పించాలని దోషులపై తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 
Loading...

లేటెస్ట్ న్యూస్ కోసం మీ ఈమెయిల్ ఎంటర్ చేయండి

Top Trending News

Latest Posts