22 ఏళ్ళ స్రవంతి ఎంబీఏ(Gold medalist). ప్రస్తుతం బ్లడ్ క్యాన్సర్ తో పోరాటం. రూ. 4 లక్షలు ఖర్చవుతుందన్న వైద్యులు అంత మొత్తం లేక తల్లిదండ్రుల కన్నీరు దాతల సాయం కోసం అభ్యర్థన

" MBA లో గోల్డ్ మెడల్ సాధించినప్పుడు బంధువులందరూ పెళ్లి సంబంధం అడిగారు ఆమెకి కష్టం వస్తే మాత్రం ఒక్కరు కూడా పట్టించుకోవట్లేదు. బ్లడ్ క్యాన్సర్ తో పోరాటం చేస్తున్నా ఒక్కరంటే ఒక్కరు కూడా దగ్గరికి రావట్లేదు. ".

ఆర్థిక స్థోమత లేకపోయినా కార్పొరేట్‌ కళాశాలలో చేర్పించారు. వారి నమ్మకాన్ని నిలబెడుతూ బాగా చదువుకుని ఎంబీఏ(Gold medalist) పూర్తిచేసి మంచి ఉద్యోగం సాధించిన తమ కూతుర్ని చూసి తల్లిదండ్రులు మురిసిపోయారు. ఉద్యోగంలో చేరిన 8 నెలలకే విధి వక్రించింది. తమ కూతురు అరుదైన బ్లడ్ క్యాన్సర్ కు గురైంది (Acute Lymphoblastic Leukemia). ప్రస్తుతం ముంబైలోని ఓ వైద్యశాలలో మృత్యువుతో పోరాడుతుంది. వ్యాధి నయం చేసేందుకు రూ. 4 లక్షల ఖర్చవుతుందని వైద్యులు చెప్తుండగా, అంత డబ్బు తమ వద్ద లేక.. కళ్లెదుటే ఆరోగ్యం క్షీణిస్తున్న బిడ్డను కాపాడుకోలేక కుమిలిపోతున్నారు.

విజయవాడ పెనమలూరుకి చెందిన కొండంరాజు, సుబ్బలక్ష్మి దంపతులకు ఇద్దరు కుమార్తెలు 
కీర్తి(24), స్రవంతి (22). తోపుడు బండి మీద పళ్ళు, కూరగాయలు అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్న కొండంరాజు.. చదువులో రాణిస్తున్న చిన్న కూతురు స్రవంతి ని చూసి మురిసిపోయాడు. ఉన్నకొద్దిపాటి పొలం అమ్మేసి ఎంబీఏ చదివించాడు. చదువు పూర్తయిన వెంటనే ఆమె ప్రతిభకి యూనిలీవర్ కంపెనీలో మంచి ఉద్యోగం వచ్చింది. ఇంటిల్లిపాది పట్టలేని ఆనందంతో సంబరపడిపోయారు. కానీ ఉద్యోగంలో చేరిన ఎనిమిది నెలలకే అనారోగ్యానికి గురైంది.
ముందు విజయవాడలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చికిత్స చేయించారు. ఆ తర్వాత హైదరాబాద్ లో పలు ప్రైవేటు ఆసుపత్రుల్లో చూయించారు. అనేక పరీక్షలు చేసినా వైద్యులు ఆమెకి వ్యాధి నిర్థారణ చేయలేకపోయారు. చివరికి ముంబైలోని కోకిలాబెన్ ధీరుభాయి హాస్పిటల్ లో ఆమెకి వ్యాధి నిర్ధారణ అయింది. Acute Lymphoblastic Leukemia అనే అరుదైన బ్లడ్ క్యాన్సర్ కు గురైంది.

బిడ్డను బతికించుకునేందుకు తల్లిదండ్రులు అన్ని విధాలా ప్రయత్నాలు చేశారు. వాళ్ళు ఉంటున్న రెండు గదుల చిన్న ఇల్లు కూడా అమ్మేసారు. ప్రస్తుతం ముంబై లోని కోకిలాబెన్ ధీరుభాయి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న స్రవంతి ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తోంది. బోన్ మారో ట్రాన్స్ప్లాంట్(Bone marrow transplant) చేస్తే ఆమెకి వ్యాధి పూర్తిగా నయం అవుతుంది. తిరిగి మాములు మనిషి అవుతుందని లేకపోతే ప్రాణాపాయం తప్పదని వైద్యులు చెప్తున్నారు. అందుకు 4 లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు తెలపడంతో వారు షాక్ కు గురయ్యారు. అప్పటికే ఉన్నదంతా అమ్మేసి చికిత్స చేయించారు. దీంతో ఎవరైనా వారికి తోచింది ఇచ్చి తమ బిడ్డ చికిత్స కోసం సాయం అందించాలని కన్నీళ్లు ఇంకిపోయేలా విలపిస్తున్నారు. ఆర్ధిక సహాయం చేయాలనుకున్నవాళ్ళు 

Account No: 860520110000516 
IFS Code:- BKID 0008605
Bank and Branch:- Bank of India, Vijayawada. కు నగదు జమచేసి అపన్నహస్తం అందజేయాలని వారు వేడుకుంటున్నారు.